News

ప్రజాస్వామ్యంపై అమెరికా అంతర్జాతీయ సదస్సు

451views
  • చైనా, టర్కీకి అందని ఆహ్వానం

వాషింగ్ట‌న్‌: ప్రజాస్వామ్యంపై డిసెంబర్​ 9,10 తేదీల్లో అమెరికా వర్చువల్​ విధానంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్​ అధ్యక్షత వహించనున్నారు. చైనా, టర్కిలను ఈ సమావేశానికి దూరం పెట్టారు. తైవాన్​కు పిలుపు అందింది. ఇది అమెరికా- చైనా ఉద్రిక్తతల్ని మరింత పెంచే అవకాశం ఉంది. అక్కడి విదేశాంగ శాఖ ప్రచురించిన ఆహ్వాన దేశాల జాబితాలో అమెరికా మిత్రదేశంగా భారత్ పాల్గొంటుంది. అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​, శ్రీలంకకు ఆహ్వానం అందలేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి