News

202 ఏళ్ల క్రితమే శబరిమల యాత్ర ప్రారంభం

701views

పట్టనంతిట్ట: శబరిమల అయ్యప్పస్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. 202 ఏళ్ల క్రితం అంటే 1819లో శబరిగిరులకు మొదటగా 70 మంది భక్తులు యాత్ర చేశారట. పురాణాల ప్రకారం.. అప్పట్లో శబరిమల ఆదాయం ఏడు రూపాయలుగా పందాలరాజ వంశీయుల రికార్డు నమోదై ఉంది. శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలోని పట్టనంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సయ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉంది.

సముద్రమట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది. శబరిమలకు చేరేందుకు పంబానది నుంచి కాలినడక మార్గం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. తిరుమల కొండలు ఎంత ప్రత్యేకమైనవో, ఇక్కడ అయ్యప్ప కొండలు కూడా అంతే ప్రత్యేకమైనవి. శబరిమలలో ఉండే 18 మెట్లు 1984 వరకు రాతి మెట్లపైనే భక్తులు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకునేవారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి