
514views
నెల్లూరు: తుపాను వల్ల ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా దెబ్బతిన్నది. వరి, వాణిజ్య పంటలు నేలకొరిగిపోవడంతో రైతన్న తీవ్ర ఆర్థిక నష్టాలకు గురయ్యాడు. మట్టి ఇళ్ళు కూలిపోవడం, ఇళ్ళల్లోకి వరద నీరు వెళ్ళిపోవడంతో సామాన్యులూ ఇక్కట్లు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులను దాతలు ఆదుకుంటున్నారు. నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం పరిసర గ్రామాల ప్రజలను సేవాభారతి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలు చేయూతనందించారు. ఆకలితో అలమటిస్తున్న వృద్ధులు, చిన్నారులు, ఇతరులకు భోజన పొట్లాట్లను పంపిణీ చేశారు.






