News

శాసన మండలి రద్దును వెనక్కి…

779views
  • ఏపీ ప్రభుత్వ తీర్మానం

విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే, ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. దాంతో శాసన మండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడిరది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది.

మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి నేడు సభలో ప్రకటించారు. ఈ మేరకు ఉపసంహరణ తీర్మానం చేశారు. మండలిని యథావిధిగా కొనసాగించాల్సిన అవశ్యకతను వివరించారు. మంత్రి ప్రవేశపెట్టిన మండలి పునరుద్ధరణ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం సభ రేపటికి వాయిదా ప‌డింది.

Source: ap7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి