
661views
-
అనుసంధాన రంగంలో పురోగతి
-
ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగ రేటు
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతుండడంతో సామాన్యులకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్ శర్మ వెల్లడించారు. ఆయన గతంలో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు ఒక్కొక్కరు నెలకు 12 జీబీ చొప్పున వాడుతున్నారని చెప్పారు. ప్రతిష్ఠాత్మక ‘డిజిటల్ ఇండియా’ విజన్ సాకారం దిశగా.. ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత్ మార్కెట్‌లోకి వస్తున్నాయని వెల్లడించారు.





