News

యూరప్‌లో కొవిడ్ విజృంభ‌ణ‌!

753views
  • లాక్ డౌన్ ఆంక్షలు వద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు

  • పలుచోట్ల హింసాత్మక ఘటనలు

బెల్జిజం: యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు.. అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు ఆగ్రహావేశాలు తెలుపుతున్నారు. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ బెల్జిజంలో వేల సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు. రాజధాని బ్రసెల్స్​లో ఆదివారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ‘ఫ్రీడం.. ఫ్రీడం’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. దీంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. కార్లను ధ్వంసం చేసి.. అక్కడున్న చెత్తకుండీలకు నిప్పంటిచారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులను కట్టడి చేసేందుకు అధికారులు బాష్పవాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. నెదర్​లాండ్స్​లోనూ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. స్థానిక యువత వాహనాలకు నిప్పు పెట్టారు. ఇప్పటివరకు 51 మందిని అధికారులు అరెస్ట్​ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.