News

దేశం కోసం కలిసి నడుస్తాం…

563views
  • మోదీతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్ 

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి​ యోగి ఆదిత్యనాథ్​.. తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసిన ఫొటోలు వైరల్​గా మారాయి. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం రాత్రి నుంచి లఖ్​నవూలోని రాజ్​భవన్​లో బస చేస్తున్నారు.

ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి యోగి ఆయన్ను కలిశారు. అప్పుడే రాజ్​భవన్​లోని ప్రాంగణంలో మోదీ-యోగి మాటల్లో మునిగిపోయారు. ఈ సమయంలోనే మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేశారు. ఈ ఫొటోలను షేర్​ చేస్తూ.. ‘నవ భారత్​’ అని క్యాప్షన్​ జోడించారు. యోగి ట్వీట్‌ రిట్వీట్​ చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్​ స్వతంత్ర దేవ్​ సింగ్‌ ‘సమగ్ర విజయంవైపు అడుగులు వేస్తూ..’ అని క్యాప్షన్​ రాశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.