
641views
-
రక్షణ శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను జనవరి నుంచి అప్‌గ్రేడ్ చేయాలని వాయుసేన నిర్ణయించింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 30 రఫేల్ విమానాలు భారత్‌కు చేరుకోగా మరో మూడు డిసెంబర్‌లో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు వాయుసేన సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం.
భారత వాయుసేన ఆమోదం అనంతరం వచ్చే ఏడాది జనవరి నుంచి అప్‌గ్రేడ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2016 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ప్రకారం అప్‌గ్రేడ్‌కు అవసరమైన పరికరాలను ఫ్రాన్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ హరియాణాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరగనుంది. మరోవైపు రఫేల్ యుద్ధ విమానాలను నడపడంలో ఫైలెట్‌లకు శిక్షణ ప్రారంభమైంది.





