News

4 దేశాలకు 50 లక్షల కొవిషీల్డ్‌ డోసుల ఎగుమతి

565views
  • సీరం సంస్థ విన్నపానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి వ్యాక్సిన్‌ అందని దేశాలకు సహాయం చేసేందుకు కోవాక్స్‌ గ్లోబల్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పుణెకు చెందిన సీరం సంస్థ 24,89,15,000 డోస్‌ల స్టాక్‌ను తయారు చేసిందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)లోని ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్‌ ప్రకాష్‌ కుమార్‌ సింగ్‌, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇటీవల తెలిపింది.

వాటిని వేగంగా పంపిణీ చేయకుంటే మా కంపెనీకి శీతల గిడ్డంగులు, మానవ వనరులపరమైన అవాంతరాలు ఎదురవుతాయని, కావున ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ‘కోవ్యాక్స్‌’ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, తజికిస్తాన్‌, మొజాంబిక్‌ దేశాలకు 50 లక్షల టీకా డోసుల ఎగుమతికి అనుమతి మంజూరు చేయాలని కోరింది. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించి అనుమతిచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.