News

అమెజాన్‌పై గంజాయి కేసు!

431views

భోపాల్‌: స్వీట్​నర్ పేరిట్ ఆన్​లైన్​లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్​ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్ ఇండియా’పై కేసు నమోదు చేశారు. ఏఎస్​ఎస్​ఎల్ పేరిట ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్​పై నార్కోటిక్స్ డ్రగ్స్ చట్టంలోని సెక్షన్ 38 కింద కేసు పెట్టినట్టు తెలిపారు. ఈ నెల 13న ఇద్దరు గ్వాలియర్ వాసుల నుంచి 21.7కిలోల గంజాయిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం నుంచి వీరు సరకును అమెజాన్ ద్వారా తెప్పించినట్టు గుర్తించారు. కాగా.. నిషేధిత వస్తువుల అమ్మకాలకు అమెజాన్​ను వేదికగా మారనీయబోమని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి