News

ముగిసిన చార్ థామ్ యాత్ర

424views
  • కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రసిద్ధ చార్​ధామ్​ యాత్ర ముగిసింది. శీతాకాలం మొదలైన నేపథ్యంలో బద్రీనాథ్​ ఆలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. శనివారం సాయంత్రం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ ఏడాది బద్రీనాథ్​ను​ 1.97లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే.. 4,000కు మందికిపైగా బద్రీనాథుడి దర్శనం కోసం వచ్చారని చెప్పారు. ఛార్​ధామ్​లో భాగమైన కేదార్​నాథ్​, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఇప్పటికే మూసివేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి