News

తిరుమలలో కనుమదారుల పునరుద్ధరణ

650views

తిరుప‌తి: భారీ వర్షాల తరువాత తిరుమల కనుమ రహదారులను అధికారులు పునరుద్ధ‌రించారు. భక్తులను తిరుమలకు తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం పునరుద్ధ‌రణను తితిదే చేపట్టింది. రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్న తితిదే ద్విచక్రవాహనాలకు అనుమతి నిరాకరించింది. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి