
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతి, గడ్చిరోలి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులతో లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో రవి వర్మ, భవానీ ఇళ్లతోపాటు విశాఖలోని అన్నపూర్ణ నివాసం, ప్రకాశంలోని ఆలకూరపాడులో తనిఖీలు చేట్టారు. ముఖ్యంగా విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో సోదాలు చేయడమే కాకుండా.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు కల్యాణ్ రావు బంధువు కావడంతో అధికారులు ఆయనను విచారించారు. వీరి ఇళ్లలో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు పుస్తకాలను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్కే జీవిత చరిత్ర పుస్తకం ప్రచురణపై కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఎన్‌ఐఏ పేరుతో ఉన్న జాకెట్లను ధరించి వచ్చారు అధికారులు. కల్యాణ్ రావు డాబా పైభాగాన్ని కూడా పరిశీలించారు ఎన్‌ఐఏ ప్రత్యేక అధికారి.
Source: NationalistHub