News

ఉత్తరప్రదేశ్‌లో ఆలయం ధ్వంసం!

627views

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలోని బిల్హౌర్‌ ప్రాంతంలో ఈ నెల 15వ తేదీన దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఉదయం పూజలు చేసేందుకు భక్తులు గుమిగూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గుజేపూర్‌ రోడ్డులోని ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన వినోద్‌ కటియార్‌ అనే వ్యక్తి హనుమంతుడు, దుర్గామాత విగ్రహాలు విరిగి పడి ఉండటాన్ని గుర్తించారు.

ఈ ఘటనపై స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. కొత్త విగ్రహాలను తీసుకొచ్చామని, అన్ని మతపరమైన ఆచార వ్యవహారాలతో విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని సర్కిల్‌ ఆఫీసర్‌(సీఓ) రాజేష్‌కుమార్‌ మీడియాకు తెలిపారు. ‘విగ్రహాలను ధ్వంసం చేయడంలో పాల్గొన్న దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టాము’ అని సర్కిల్‌ ఆఫీసర్‌ రాజేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి