
586views
న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) డైరెక్టర్ల పదవీకాలం అయిదేళ్ళు. ఇప్పటి వరకు ఈ పోస్టుల గరిష్ఠ కాలపరిమితి రెండేళ్ళు మాత్రమే.
శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. ప్రస్తుతం, పార్లమెంటు సమావేశాలు జరగడం లేదు. అటువంటి పరిస్థితిలో, ప్రస్తుత సమయంలో ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి సరిగ్గానే పరిగణించారు. అయితే, వారి పదవీకాలం అయిదేళ్ళు పూర్తయిన తర్వాత ఇద్దరికి సర్వీసు పొడిగింపు ఇవ్వరు.
Source: Tv9





