News

పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్య!

1kviews

పాలక్కాడ్‌(కేరళ): కేరళలోని పాలక్కాడ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తను దుండగులు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో నరికి చంపారు. మృతుడు మంబరం ఎల్లపుల్లికి చెందిన సంజిత్‌గా గుర్తించారు. సంజిత్‌కు 27 ఏళ్ళు ఉంటాయి. భార్య, ఏడాది బాబుతో బైక్‌పై వెళ్తున్న సంజిత్‌ను కారుపై వచ్చిన కిరాతకులు అడ్డుకుని దాడి చేసి, కత్తులతో 50సార్లు నరికి పొట్టన పెట్టుకున్నారు. కారులో నలుగురు నిందితులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ హత్య వెనుక ఎస్‌డీపీఐ హస్తం ఉందని బీజేపీ పాలక్కాడ్‌ జిల్లా అధ్యక్షుడు కెఎం హరిదాస్‌ ఆరోపించారు.

Source: Organiser/VskKerala

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి