News

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో 5జీ ఇంటర్నెట్ సేవలు

384views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో 5జీ సేవల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నాటికి 5జీ స్పెక్ట్రంను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు కేంద్ర సమాచార, ఐటీ, రైల్వేశాఖల మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. ‘5జీ స్పెక్ర్టం విషయంలో ప్రస్తుతం ట్రాయ్‌ సమగ్ర కసరత్తు చేస్తోంది. వారు సిఫార్సులు పంపిన తర్వాత.. మేం వేలంపాటను ప్రారంభించగలం’ అని మంత్రి తెలిపారు. ట్రాయ్‌ తన సిఫార్సులను టెలికమ్యూనికేషన్స్ విభాగానికి ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ప్రారంభంలో పంపగలదని ఆశిస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి