News

భారత్ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్ షిప్

602views
  • ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా

న్యూఢిల్లీ: యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్​ వేదికగా జరగనున్నట్టు జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య వెల్లడించింది. యోగాను క్రీడగా ఇటీవల గుర్తించిన కేంద్రం.. ఈ ఏడాది నిర్వహించిన ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో యోగాకు స్థానం కల్పించింది. మహిళలు, పురుషుల విభాగాల్లో చాలామంది అభ్యర్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి