
-
ఆర్నెల్ల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండనున్న రాజాచారి
వాషింగ్టన్: ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ రోదసీ యాత్రల సంస్థ తాజాగా ఎండ్యూరెన్స్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది. ఈ నౌకలో భారత సంతతికి చెందిన రాజాచారి కూడా ఉన్నారు. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఐఎస్‌ఎస్(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో రాజాచారి ఆర్నెల్ల పాటు ఉండనున్నారు. రాజాచారితో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు కూడా స్పేస్ ఎక్స్ ఎండ్యూరెన్స్ వ్యోమనౌకలో రోదసిలో ప్రవేశించారు. వీరు ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్‌ను నేడు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం(డాకింగ్) చేయనున్నారు.
ఈ రోదసియాత్రకు కమాండర్‌గా వ్యవహరిస్తున్న రాజాచారి మూలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆయన తండ్రి పేరు శ్రీనివాస్ చారి. మహబూబ్ నగర్‌కు చెందిన చారిది విద్యావేత్తల కుటుంబం. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన శ్రీనివాస్ చారి అమెరికాకు చెందిన అమ్మాయి(పెగ్గీ ఎగ్బర్ట్)ని వివాహం చేసుకున్నారు. రాజాచారి అమెరికాలోనే జన్మించారు. ఆయనకు ఇదే తొలి అంతరిక్ష యాత్ర.
Source: ap7am





