![](https://vskandhra.org/wp-content/uploads/2021/11/Kangana-Ranaut-.jpg)
269views
-
మోదీ వచ్చాకే నిజమైన స్వాతంత్య్రమన్న కంగనా
ముంబై: 1947లో మనకు లభించింది నిజమైన స్వాతంత్య్రం కాదని.. అది మనకు వేసిన భిక్ష అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా లభించినదాన్ని నిజమైన స్వాతంత్య్రంగా ఎలా భావిస్తామని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో కూడా బ్రిటీష్ పాలనే కొనసాగిందని ఆమె చెప్పారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Source: Ap7am