News

2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా భారత్

432views
  • అంతర్జాతీయ సదస్సులో పేర్కొన్న మోడీ

గ్లాస్గో: 2070 నాటికి ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు కట్టడి చేసేందుకు పారిస్​ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన ఏకైక దేశం భారత్ అని చెప్పారు. వాతావరణ మార్పుల కట్టడి కోసం భారత్​ ఎంతో శ్రమిస్తోందని దాని ఫలితాలు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు గ్లాస్గో వేదికగా జరిగిన కాప్26​ ‘ప్రపంచ నేతల సదస్సు’లో ఆయన మాట్లాడారు. భారత్​ తన విధానాలలో వాతావరణ మార్పులను కేంద్ర స్థానంలో ఉంచుతోందని మోదీ తెలిపారు. రాబోయే తరానికి ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల సిలబస్​లో వాతావరణ అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాతావరణ మార్పుల కోసం ఐదు లక్ష్యాలను భారత్​ నిర్దేశించుకుందని మోదీ ఈ సదస్సులో తెలిపారు. తద్వారా వాతావరణ మార్పుల కట్టడిలో భారత్ అద్భుత ఫలితాలు సాధిస్తుందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి