News

బాలిక‌ను బలితీసుకున్న ఇస్లామిక్‌ చికిత్స!

682views

తిరువనంతపురం: అనారోగ్యానికి గురైన 11 ఏళ్ళ బాలిక‌కు ఆధునిక వైద్యం అందించకుండా మొండిగా ఇస్లామిక్‌ మతపరమైన చికిత్స అందించడంతో ఆ పాప మరణించింది. ఆ ఇంటి ఇరుగుపొరుగు వారు అందించిన వివరాల ప్రకారం… కేరళలో 11 ఏళ్ల ఫాతిమా అనే బాలిక నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండేది. ఫాతిమా తల్లిదండ్రులు సనాతన మత విశ్వాసులు. ఆధునిక ఔషధాలపై నమ్మకం లేదు. దీంతో వారు ఆ బాలికకు ఆధునిక మందులు ఇవ్వలేదు. బదులుగా ఇస్లామిక్‌ మతపరమైన చికిత్సపై ఆధారపడ్డారు.

ఫాతిమా ఆరోగ్యం రోజు రోజుకీ మరింతగా క్షీణించడంతో తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రి అధికారులు ఆ బాలిక మరణించినట్టు ధ్రువీకరించారు. గతంలో కూడా ఈ కుటుంబంలో ఇటువంటి మరణం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి