
గౌహతి: ముస్లిం అమ్మాయిలు జీన్స్‌ప్యాంట్ వేసుకోకూడదు… ఇది అస్సాంలోని రాడికల్ ముస్లిం నేతల కొత్త ఫత్వాలా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్ చారియాలి పట్టణంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ముస్లిం విద్యార్థినిపై ముస్లిం మత గురువు భౌతికంగా దాడి చేసి, దుర్భాషలాడాడు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 25న సాయంత్రం హెడ్‌ఫోన్స్ కొనుగోలు చేసేందుకు సమీపంలోని మొబైల్ దుకాణానికి వెళ్ళింది. అప్పుడు ఆమె జీన్స్ ప్యాంట్, కుర్తీ ధరించివుంది. ఆ వేషధారణలో ఆమెను చూసిన దుకాణదారు నూరుల్ అనిమ్(60) దుర్భాషలాడాడు. దీంతో ఆమె మాటకు మాట సమాధానంగా ఇవ్వడంతో అతను ఆ విద్యార్థిని షాపు నుండి బయటకు గెంటేశాడు. అక్కడితో ఆగలేదు… వేశ్యలు మాత్రమే ఈ రకమైన దుస్తులు ధరిస్తారని, ముస్లిం బాలికలు తప్పనిసరిగా బురఖా ధరించాలని చెబుతూ దుర్భాషలాడాడు.
‘ఇయర్‌ఫోన్స్ కొనుక్కోవడానికి అతని ఇంటికి వెళ్లాను… అతను నన్ను మందలించడంతో షాక్ అయ్యాను.. మొదట్లో అసలు విషయం ఏంటో అర్థం కాలేదు… ఇంతలోపే నాపై విరుచుకుపడ్డాడు. నేను జీన్స్ ధరించకూడదని, వీధిలో తిరుగుతున్నప్పుడు బురఖా ధరించి ఉండాలని చెప్పాడు’ అని ఆ విద్యార్థిని పోలీసుల వద్ద బోరుమంది. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించింది. నూరుల్ అమీన్‌తో బాలిక తండ్రి అయూబ్ ఖాన్ వాగ్వాదానికి దిగాడు. మూడు రోజుల తరువాత నూరుల్ అమీన్ ఇద్దరు కుమారులు, రఫీకుల్ ఇస్లాం, షాహిదుల్ ఇస్లాం అయూబ్ ఖాన్‌ను రోడ్డుపై గుర్తించి, కొట్టారు. ఈ సంఘటనలపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఫీకుల్ ఇస్లాం, సాహిదుల్ ఇస్లామ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Source: Organiser





