
-
వెనక్కి పంపేందుకు ప్రభుత్వం చర్యలు
బెంగళూరు: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారతదేశంలోనికి చొరబడ్డారని అభియోగం ఎదుర్కొంటున్న రోహింగ్యాలపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా రోహింగ్యాలకు సంబంధించి సుప్రీం కోర్టులో కొత్త అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను వెనక్కి పంపాలని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హోం శాఖ తాజా అఫిడవిట్‌లో కర్ణాటకలో 126 మంది రోహింగ్యాలను గుర్తించినట్టు చెప్పారు. ఈ రోహింగ్యాలను కర్ణాటక పోలీసులు తమ శిబిరాల్లో ఎక్కడా ఉంచలేదు. ఈ విషయమై 2017లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలందరినీ ఏడాదిలోగా భారత్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. దేశంలో రోహింగ్యాలు ఉండటం వల్ల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Source: Panchjanya





