News

చేయూత మాని ఒత్తిడి తేవటం సరికాదు

412views
  • అగ్ర దేశాలకు భార‌త ప్ర‌ధాని మోడీ బోధ

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకారం అందించకుండా.. వాతావరణ మార్పుల నివారణపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. క్లైమెట్ ఫైనాన్స్​ విషయంలో నిర్లక్ష్యాన్ని భారత్ విస్మరించలేదని అన్నారు. హరిత ప్రాజెక్టుల కోసం సంపన్న దేశాలు తమ జీడీపీలో ఒక శాతం నిధులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిర్వహించిన ‘వాతావరణ మార్పులు, పర్యావరణం’ అంశంపై ఆయన ప్రసంగించారు. వాతావరణ ధర్మాన్ని విస్మరించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం చేయడమే కాకుండా.. మానవాళి అంతటినీ మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాలకు మూడు కీలక సూచనలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి