News

కాబూల్ నుండి నీటిని పంపిన ఆఫ్ఘన్ అమ్మాయి – అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలంలో సమర్పించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

92views

క ఆఫ్ఘన్ అమ్మాయి పంపిన కాబూల్ నది నీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం (అక్టోబర్ 31, 2021) అయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో సమర్పించారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఓ బాలిక కాబూల్ నది నుండి నీటిని సేకరించి అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతున్న పవిత్ర స్థలంలో ఆ నీటిని సమర్పించాల్సిందిగా కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ నీటిని పంపింది.

“రామ మందిర నిర్మాణ స్థలం వద్ద కాబూల్ నది మరియు గంగా జలాలను సమర్పించడానికి నేను అయోధ్యకు వచ్చాను” అని యోగి ఆదిత్యనాథ్ మీడియాకు తెలిపారు.

అయోధ్యతో తనకు ముడిపడివున్న గొప్ప ధార్మిక అనుబంధాన్ని ఆ బాలిక తన ఈ చర్య ద్వారా ప్రకటించిందని అదిత్యనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. బాలిక చర్యను ఆయన శతధా ప్రశంసించారు.

దీపావళి వేడుకల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 75 జిల్లాల నుంచి సేకరించిన 12 లక్షల “దియాలు” (మట్టి దీపాలు) ఈ సంవత్సరం అయోధ్యలో వెలిగించనున్నట్లు రాష్ట్రం ప్రకటించింది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.