
550views
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్ అయిదోతేదీ నుంచి డిసెంబర్ నాలుగోతేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు కార్తీక మాసంలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ మాసంలో స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ నిర్వాహకులకు భక్తులు సహకరించాలని కోరారు.





