
తమిళనాడు: ఏబీవీపీ తిరుచ్చి కార్యాలయంపై దేశ వ్యతిరేకులు దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో గుర్తు తెలియని గూండాలు ఈ చర్యకు దిగారు. మా కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి రాళ్లు, ఇసుక, మండే నూనె పదార్థాలను ఉపయోగించారని ఏబీవీపీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సభ్యులతో ప్రశంనీయమైన సేవలు చేస్తూ, ప్రజల నుంచి అభినందనలు అందుకుంటుండడంతో ఓర్వలేని దుండగలు ఈ దాడికి ప్లాన్ చేశారని ఏబీవీపీ దుమ్మెత్తిపోసింది.
‘నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏబీవీపీ కోసం క్రియాశీల సభ్యత్వం జరుగుతోంది… చాలా మంది విద్యార్థులు మా సంస్థలో చురుకుగా చేరుతున్నారు. మా సామూహిక సభ్యత్వ ప్రచారం పట్ల కొన్ని జాతీయ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక సంస్థలు చాలా నిరాశ చెందాయి… తత్ఫలితంగా, మాపై వారి సొంత శైలిలో హింసకు తెరతీశాయి’ అని ఆ ప్రకటనలో విమర్శించింది.

కాగా, ఈ దాడిపై సమీపంలోని పోలీస్ స్టేషన్(కోట)కి ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. డీఎంకే పార్టీ సభ్యులు ఆర్‌ఎస్‌వైఎఫ్ వంటి కమ్యూనిస్ట్ నక్సల్స్ సంస్థలకు మద్దతు ఇస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యతిరేకులను అనుమతించిందని ఏబీవీపీ ఆరోపించింది. దాడిపై ఏబీవీపీ నాయకులు రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.
Source: Organiser





