
742views
కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లా, జానాల, బలపాల తిప్ప, సిద్దేశ్వరం, పాత మాడుగల, యర్రమఠం తదితర చెంచు గూడాలలో చెంచులకు చీరలు, ప్యాంట్లు, చొక్కాలు, పిల్లల దుస్తులు పంపిణీ జరిగింది. నంద్యాల సంఘమిత్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జానాల గూడెం శ్రీ సుధాకర్, బలపాల తిప్ప, విజయుడు, పెద్దస్వామి అతిథులుగా పాల్గొనగా, సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్, విభాగ్ ధర్మజాగరణ ప్రముఖ్ రాంప్రసాద్, గోకవరం ఆవాస ప్రముఖ్ రామకృష్ణతో పాటు చెంచు గూడాలలోని చెంచు పెద్దలు పాల్గొన్నారు.






