News

చైనా బొమ్మల్లో విష పదార్థాలు!

876views
  • హెచ్చరించిన అమెరికా

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్​లో మేడ్​-ఇన్​-చైనా బొమ్మలను అధికారులు సీజ్​ చేశారు. బొమ్మలను ప్రమాదకర రసాయనాలతో కోటింగ్​ చేసినట్టు గుర్తించారు. ఇలాంటి బొమ్మలు భారత్​లో భారీ సంఖ్యల్లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హాలీడే సీజన్​లో పిల్లలకు ఆటవస్తువులు ఆన్​లైన్​లో కొనుగోలు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని యూఎస్​ సీబీపీ(కస్టమ్స్​ అండ్​ బార్డర్​ ప్రొటక్షన్​) హెచ్చరించింది.

బొమ్మలను భారీ మొత్తంలోని లీడ్​, కాడ్​మియమ్​, బేరియమ్​ కోటింగ్​లు కనపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బొమ్మలను ఈ ఏడాది జులై 16న సీబీపీ అధికారులు, సీపీఎస్​సీ(కన్జ్యూమర్​ ప్రోడక్ట్స్​ సేఫ్టీ కమిషన్​) తనిఖీలు చేశారు. మొత్తం ఏడు బాక్సుల్లో చైనా నుంచి బొమ్మలు వచ్చాయి. వీటిల్లో చాలా వరకు భారత దేశంలోనూ అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఆగస్టు 24న బొమ్మలను ల్యాబ్​కు పంపించారు. అక్కడే బొమ్మల్లో ప్రమాదకర రసాయనాల కోటింగ్​ విషయం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్​ 4న వాటిని అధికారులు సీజ్​ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి