News

100 వారసత్వ కట్టడాలపై మెరిసిన మువ్వన్నెల జెండా

387views

న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ 100 కోట్ల మార్క్​ దాటిన సందర్భంగా దేశంలోని వంద చారిత్రక కట్టడాలపై జాతీయ జెండా మెరుపుల్ని వెలిగించినట్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్ టూంబ్, తుగ్లకాబాద్ కోట, పురానా ఖిలా, ఆగ్రా, రామప్ప గుడి, హంపి, ధోలవీర, చారిత్రక ప్రాంతాలతో పాటు దేశంలోని మరిన్ని చారిత్రక కట్టడాలపై త్రివర్ణ వెలుగులు విరజిమ్మాయి. కొవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి ఈ విధంగా ధన్యవాదాలు తెలిపినట్టు అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి