News

బంగ్లాదేశ్ ముస్లింల‌ ఘోరాలు!

568views
  • మతోన్మాది ఇక్బాల్ హుస్సేన్ కోసం కొన‌సాగుతున్న గాలింపు

ఢాకా: బంగ్లాదేశ్‌లో శాంతంగా బ‌తుకుతున్న‌ హిందువుల‌పై ముస్లింలు జ‌రిపిన దాడులు ఇప్పుడు స్ప‌ష్టంగా బ‌య‌టప‌డుతున్నాయి. ద‌స‌రా పండ‌గ రోజుల్లో ఈ దాడులు జ‌రిగిన విష‌యం విదిత‌మే. అయితే, వీటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆ దృశ్యాల‌ను చూసిన వివిధ ప్ర‌దేశాల్లో ఉన్న హిందువులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు.

కాగా, ముస్లింల దాడుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,500 మందికి చెందిన ఇళ్ళు బూడిద‌య్యాయి. 315 దేవాలయాలు కూలాయి. మ‌రికొన్ని దెబ్బతిన్నాయి. దాదాపు 10 మంది హిందువులు దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. వందలాది మంది గాయపడ్డారు. 23 మంది బాలికలు, మహిళలు అత్యాచారానికి గురయ్యారు. కొన్ని ప‌శువులూ ముస్లింల మార‌ణ‌కాండ బ‌ల‌య్యాయి.

ఈ ఘోరాల‌ వెనుక ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అయితే, నిందితుడు ప‌రారీలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌లోని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ అతని కోసం వెతుకుతోంది. abpnews channel cctvfootage లో ఇక్బాల్ హుస్సేన్ దుర్గా పూజ పండల్ వద్ద ఖురాన్‌తో నడుస్తున్నట్టు చూడవచ్చు.

Source:  abpnews, @mishra167, Samvadaworld

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి