
-
ఆ ముస్లిం ఉన్మాదిని గుర్తించిన పోలీసులు
-
దేశవ్యాప్త హింసకు అతడే కారణం
-
తప్పించుకు తిరుగుతున్న నిందితుడు
-
తీవ్రంగా గాలిస్తున్న బంగ్లా క్లూస్ టీం
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు ప్రేరేపించిన ముస్లిం ఉన్మాదిని అక్కడి పోలీసులు గుర్తించారు. నిన్న బుధవారం ఈ నెల 13 న కొమిల్లాలోని దుర్గా పూజా పండల్‌లో ఖురాన్ ఉంచిన వ్యక్తిని గుర్తించారు. నూర్ అహ్మద్ ఆలం కుమారుడు ఇక్బాల్ హుస్సేన్(35) కోమిల్లాలోని దుర్గా పూజా పండాల్లో ఖురాన్ ఉంచారు. నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది.
“కొమిల్లా ఘటనలో ప్రధాన నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తారని నేను ఆశిస్తున్నాను … పట్టుబడకుండా ఉండటానికి అతను తరచూ లొకేషన్‌లను మారుస్తున్నాడు. అతను అరెస్టయిన తర్వాత కొమిల్లా సంఘటనను మేము బయటపెట్టగలుగుతాము, ”అని ఢాకా ట్రిబ్యూన్ బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ను ఉటంకించింది. హుస్సేన్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు తాను ఉంటున్న ప్రదేశాలను మార్చుతున్నాడని, అతని కుటుంబం ధ్రువీకరించింది. హుస్సేన్ గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు బహుళ సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్కాన్ చేశారు.
ఖురాన్ అపవిత్రం వార్త వ్యాప్తి చెందడంతో ఇస్లాం వాదులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత జరిగిన హింసలో, ముస్లింల గుంపులు దేశవ్యాప్తంగా ఉన్న దుర్గా పూజా పండళ్లను లక్ష్యంగా చేసుకుంది. హిందూ గృహాలు, దేవాలయాలపై కూడా దాడి చేసిన విషయం విదితమే. అక్టోబర్ 15 న హిందువులు దసరా వేడుకలు జరుపుకుంటున్నప్పుడు 200 మందికి పైగా ముస్లింలు నోఖలిలోని ఇస్కాన్ ఆలయంపై దాడి చేశారు. పది మంది భక్తులు కూడా మరణించారు.
అక్టోబర్ 17న, ఇస్కాన్ ఒక ప్రకటన విడుదల చేసింది, “బంగ్లాదేశ్ సమాజంలో శాంతి, శ్రేయస్సును దెబ్బతీసే మైనారిటీలపై జరుగుతున్న హింసను అంతం చేయడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ పౌరులందరికీ దీర్ఘకాలిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస ప్రారంభమైనప్పటి నుండి ఇస్కాన్ నిరసన వ్యక్తం చేస్తోంది. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇస్కాన్ బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇస్లామిస్టులు చేసిన అకృత్యాలను ఎత్తి చూపడానికి శనివారం (అక్టోబర్ 23) ప్రపంచవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది.
కాగా, బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిస్టులపై వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ (VHP) బుధవారం (అక్టోబర్ 20) దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. హిందువులను రక్షించడానికి ఐక్యరాజ్యసమితి బంగ్లాదేశ్‌కు శాంతి భద్రతా దళాన్ని పంపాలని కూడా డిమాండ్ చేసింది.
Source: Organiser





