
525views
-
బ్రిటన్ చట్టాలు ఉల్లంఘించడమే కారణం
లండన్: ఫేస్‌బుక్‌కు బ్రిటన్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్టు బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్టు పేర్కొంది.





