News

చైనా సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు

459views
  • సైన్యం తరలింపునకు భారత్ సత్వర చర్యలు

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఘర్షణకు దిగితే సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లో 1350 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని వేగంగా తరలించేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా మౌలిక వసతులను భారీగా మెరుగుపరచుకోవడం సహా అధునాతన నిఘా సాధనాలను ఉపయోగిస్తోంది. సైనిక పోరాట సన్నద్ధతకు ఊతమిచ్చేందుకు ఒక మెగా ప్రణాళికను సిద్ధం చేసినట్టు అధికారులు సోమవారం తెలిపారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో దాదాపు 20 వంతెనలు, అనేక సొరంగ మార్గాలు, వైమానిక స్థావరాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి