![](https://vskandhra.org/wp-content/uploads/2021/10/KERALA.jpg)
భారత స్వాతంత్ర్య డెబ్బై ఐదవ వార్షికోత్సవం (ఆజాదీ కా అమృత మహోత్సావ్) లో భాగంగా, కేరళ కోజికోడ్ కు చెందిన కేసరి వార పత్రిక ‘అక్షర రథ యాత్ర’ను నిర్వహించింది. కన్యాకుమారి నుండి కోజికోడ్ వరకు ఈ ఊరేగింపు సాగింది. రథయాత్రను వివేకానంద కేంద్రం కన్యాకుమారి ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ నివేదితా భిడే జెండా ఊపి ప్రారంభించారు.
కన్యాకుమారి శిల్పులు నల్ల గ్రానైట్ తో చెక్కిన సరస్వతీదేవి విగ్రహాన్ని కన్యాకుమారి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి, కోజికోడ్‌ని కేసరి భవన్ లో ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠాపన తరువాత అక్టోబర్ 7 నుండి 15 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, విజయ దశమి రోజున స్త్రీ శక్తి దినోత్సవంగా జరుపుకునే నేపథ్యంతో కార్యక్రమం యోజన చేయబడింది.
రాష్ట్రం నలుమూలలలోనూ అక్షర రథ యాత్రకు భారీ స్వాగతం లభించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఊరేగింపుకు కేరళలోని ప్రధాన దేవాలయాలు మరియు ఆశ్రమాలతో సహా 100 కి పైగా కేంద్రాలలో ఘన స్వాగతం పలికారు. కేసరి మీడియా రీసెర్చ్ సెంటర్‌లో కొత్తగా నిర్మించిన లైబ్రరీ కోసం యాత్రలో వివిధ వ్యక్తుల నుండి పెద్ద సంఖ్యలో పుస్తకాలను కూడా సేకరించారు. రాజకీయాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు, రాజకీయ పక్షాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, పండితులు అనేకమంది వివిధ కేంద్రాలలో ఈ సాంస్కృతిక ఊరేగింపులో పాల్గొన్నారు. కోజికోడ్ జిల్లాలోని పంతీరాంకావ్ వద్ద ఊరేగింపు చివరి రోజున యాత్రను జాతీయవాద ముస్లిం మరియు లక్షద్వీప్ కేంద్రంగా పనిచేసే సముద్ర శాస్త్రవేత్త పద్మశ్రీ అలీ మాణిక్ ఫ్యాన్ స్వాగతించారు. సరస్వతి విగ్రహం ముందు హారతినిచ్చి లైబ్రరీకి పుస్తకాలను అందించారు.
విగ్రహం ముందు హారతి ఇస్తున్న అలీ మాణిక్ ఫ్యాన్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఇస్లామిక్ జిహాదీలు, మత ఛాందసవాదులు సోషల్ మీడియాలో ఆయనను దూషిస్తూ, ఆయనపై దాడి మొదలెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వచ్చాయి.
జిహాదీల నుండి వచ్చిన విపరీతమైన ఒత్తిడి ఫలితంగా, అక్షర రథ యాత్రలో పాల్గొన్నందుకు క్షమాపణలు కోరుతూ ఆయన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ను పెట్టారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన తన అనుచరులకు క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటన, కేరళలో నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తోంది.
భారత స్వాతంత్ర్య డెబ్బై ఐదవ వార్షికోత్సవానికి సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని లైబ్రరీ కోసం పుస్తకాలను సమర్పించిన ఒక జాతీయవాద ముస్లింను ఈ విధంగా వేధించడం, బెదిరింపులకు గురిచేయడం తీవ్రమైన, ఆందోళన కలిగించే విషయం. అలీ మాణిక్ ఫ్యాన్ క్షమాపణ చెప్పడాన్ని ‘మధ్యమం’ అనే ఇస్లామిక్ మీడియా ఘనవిజయంగా అభివర్ణించింది.
జాతీయవాద ఆదర్శాల పట్ల గౌరవం ఉన్న ముస్లింలు కూడా కేరళలో తమ ఉనికి కోసం ఛాందసవాదులకు భయపడి లొంగి ఉండవలసి ఉంటుంది. లక్షద్వీప్‌లో మహాత్మాగాంధీ విగ్రహ ప్రతిష్టను, తిరూర్ లో మలయాళ భాషా పితామహుడు తుంచత్ రామానుజన్ ఎజుతచన్ విగ్రహ ప్రతిష్టను జిహాదీలు వ్యతిరేకించారనే వాస్తవాన్ని కూడా మనం మరువరాదు. కేరళలో జిహాదీల చర్యలు, వారి ఆగడాలు కేరళను ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు, ఆ ప్రణాళిక యొక్క వేగవంతమైన అమలుకు ప్రబల సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
Source : VSK BHARAT