
401views
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్‌ఎమ్ నరవణే సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ తెలిపింది. పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించారు. చైనా ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొట్టాలని సైనికులకు సూచించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





