News

జపాన్‌ ప్రధానితో మోడీ భేటీ

723views

వాషింగ్టన్ డిసి: అమెరికా పర్యటనలో భాగంగా.. జపాన్‌ ప్రధాని యొషిహిడె సుగాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్‌ ఎకానమీ, వాణిజ్య, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయని పేర్కొంది. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు యొషిహిదే సుగాకు మోదీ ధన్యవాదాలు తెలిపారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా తెలిపారు. అఫ్గాన్‌ సహా ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి