
594views
తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయాల్లో బుధవారం అధికారులు గో పూజను లాంఛనంగా ప్రారంభించారు.
ప్రతి ఆలయంలో భక్తులకు గోపూజ అందుబాటులోకి వచ్చే ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు డిప్యూటీ ఈవో జనరల్ రమణ ప్రసాద్గో సంరక్షణ శాల అధికారులు ఆయా ఆలయాలకు గోవులు, దూడలను అందజేసి గోపూజ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు.
Source: TTD News





