News

అమెరికా రక్షణ వ్యవస్థలో భారతీయ అమెరికన్‌కు చోటు

500views

పెంటగాన్: అధ్యక్షుడు జో బైడెన్​ బృందంలో మరో భారతీయ అమెరికన్కు చోటు దక్కింది. అగ్రరాజ్య రక్షణ శాఖ విభాగం పెంటగాన్​లో కీలక పదవికి భారతీయ అమెరికన్​ మేనేజ్​మెంట్​ సలహాదారు ఆశిష్​ వజిరాణిని నామినేట్​ చేయనున్నట్టు బైడెన్ ప్రకటించారు. రక్షణ మంత్రి ఆధ్వర్యంలోని సిబ్బంది, యుద్ధ సన్నద్ధత విభాగం డిప్యూటీగా వజిరాణి నామినేట్​ అయినట్టు పెంటగాన్​ తెలిపింది. మరోవైపు.. పెంటగాన్​లో కీలక పదవితో పాటు నేషనల్​ అకాడమీ ఆఫ్​ సైన్స్​, ఇంజినీరింగ్​, మెడిసన్స్​ కమిటీల్లో సభ్యులుగా వజిరాణి ఎంపిక‌యిన‌ట్టు శ్వేతసౌధం తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి