News

కేరళలో నార్కో జిహాద్‌!

134views
  • ఆంధ్రా నుంచి మత్తుమందు సరఫరా!

తిరువనంతపురం: కేరళలో నార్కో జిహాద్‌ ఆగడం లేదు. చట్ట వ్యతిరేక వ్యాపారం వల్ల అధిక లాభాలు వస్తుండడం, తమ మతపరమైన కోరికలు నెరవేరుతుండడంతో అధిక సంఖ్యాకులు దీనినే నమ్ముకున్నారు.

మలప్పురంలో హమీద్‌, అలీ, షరఫుద్దీన్‌, జంషాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.5 కోట్ల విలువైన హషిష్‌ ఆయిల్‌, గంజాయి ఎక్సైజ్‌ బృందం స్వాధీనం చేసుకుంది. సుహైల్‌కి చెందిన స్థలంలో డ్రగ్స్‌ దాచారు. పక్కా సమాచారంతో ఎక్సైజ్‌ బృందం ఉదయం ఆరు గంటలకు ఆ ఆవరణపై దాడి చేసింది. డ్రగ్స్‌ విక్రయదారులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి డ్రగ్స్‌ తెప్పించినట్టు అంగీకరించారు.

10 మి.లీ హషీష్‌ నూనెను లీటర్‌ రూ. 3,000 నుంచి రూ .75,000 వరకు పలుకుతుందని నిందితులు చెప్పారు. ఈ నలుగురు డ్రగ్‌ పెడ్లర్లు అనేక ఏళ్ళ నుండి ఈ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారని పోలీసులకు తెలిసింది. నిందితులు కూడా ఈ వ్యాపారానికి చిన్న ఏజెంట్లను ఉపయోగిస్తారని పోలీసులు గుర్తించారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి