
-
28 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
-
బ్యాంకు ఖాతాల పరిశీలన
-
11 లాకర్లు గుర్తించిన అధికారులు
-
1.8 కోట్ల నగదు స్వాధీనం
-
పన్ను ఎగవేత కోసం రుణాలుగా చిత్రీకరణ
-
ఐటీ శాఖ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: నటుడు సోనూసూద్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేశాడు. ఇది మొత్తం రూ. 20 కోట్లని ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. కొద్ది రోజులు అనుమానించిన ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. వరుసగా మూడోరోజుల పాటు సోదాలు చేశారు. సోనూసూద్ 20కోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలు సేకరించినట్టు వెల్లడించారు.
ముంబై, నాగ్‌పూర్, జైపూర్‌లలో ఏకకాలంలో 28 ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. సోనూసూద్ ఆర్థిక లావాదేవీలతో పాటు.. సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. 11 లాకర్లను గుర్తించిన ఐటీ అధికారులు కోటీ ఎనిమిది లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా టైమ్‌లో ఎంతోమంది వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చిన సోనూసూద్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఐతే ఆ సమయంలో సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్.. 18 కోట్లకు పైగా విరాళాలు సేకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కోటీ 90 లక్షల రూపాయలు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ బట్టి తెలుస్తోంది. ఐతే మిగిలిన డబ్బు ఏమైందన్న అంశంపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి క్రౌడ్ ఫండిరగ్ ప్లాట్ ఫాంను ఉపయోగించి సోనూసూద్ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఐటీ శాఖ అధికారులు చెప్పారు.
పన్ను ఎగవేత కోసం ఖాతాలను పుస్తకాల్లో రుణాలుగా చిత్రీకరించారని అధికారులు వెల్లడిరచారు. సోనూసూద్ కంపెనీకి, లక్నో రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య జరిగిన అగ్రిమెంట్‌పై ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందంలో సోనూసూద్ పన్ను ఎగవేశారని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది.
Source: Tv9





