News

కేరళలో కోరలు సాచిన నార్కోటిక్‌ జిహాద్‌!

868views

రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌తో ముగ్గురి అరెస్టు

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ముగ్గురు నిషేధిత మత్తుమందు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రూ.10లక్షల విలువైన 100 గ్రాముల ఎండిఎంఎ అనే నిషేధిత మత్తుమందును రవాణా చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెంగళూరు నుంచి నౌషాద్‌ పిటి(40), శృతి(25), యదు(25)లను డ్రగ్‌ తీసుకువస్తుండగా, కేరళ-కర్ణాటక సరిహద్దు వద్ద అరెస్టు చేశారు. యాదు, శృతి ఇద్దరూ తిరువనంతపురంలోని టెక్నో పార్క్‌లో పనిచేస్తున్నారు.

మాదకద్రవ్యాల వ్యాపారం కోసం ముస్లిమేతరులను ఉపయోగించే కొత్త ముఠా ఈ ప్రాంతంలో పెరుగుతోంది. కేరళలో ఒక బిషప్‌ చేసిన మత్తుమందు జిహాద్‌ వ్యాఖ్య పెద్ద వివాదాన్ని సృష్టించిన తర్వాత, ఇస్లాంవాదులు తమ మత్తుమందు జిహాద్‌ వ్యాపారంలో ముస్లిమేతరులను చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు.

కొచ్చిలో డ్రగ్‌ రాకెట్‌

  • రూ.కోటి విలువైన డ్రగ్స్‌ స్వాధీనం, ఏడుగురి అరెస్టు

కొచ్చి(కేరళ)లో డ్రగ్స్‌ రాకెట్‌ బట్టబయలైంది. కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డ్రగ్‌ పెడ్లర్లు ముహమ్మద్‌ అజ్మల్‌, ఫైసల్‌, ముహమ్మద్‌ ఫాబాజ్‌, ముహమ్మద్‌ అఫ్సల్‌, తైబా, షమన్‌, శ్రీమోన్‌. మాదకద్రవ్యాల వ్యాపారం కొచ్చిలోని ఒక ఫ్లాట్‌లో కేంద్రీకృతమై ఉందని పోలీసులు తెలిపారు.

ఈ వ్యాపారం గురించి సమాచారం అందుకున్న తరువాత, కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ వింగ్‌, ఎక్సైజ్‌ కాక్కనాడు(కొచ్చి)లోని ఫ్లాట్‌లో సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేశాయి. నిందితులు తమ మత్తుమందు వ్యాపారం కోసం ఐ 20 కారును ఉపయోగించారని దర్యాప్తు సంస్థలు వెల్లడిరచాయి. వ్యాపారులు ఎండిఎంఎ, ఎల్‌ఎస్‌డి, ఇతర మత్తుమందులు విక్రయించారు. ఈ డ్రగ్స్‌ చెన్నై నుంచి తెచ్చినట్టు పోలీసులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి