
న్యూఢిల్లీ: అండమాన్, నికోబార్ దీవులు భూ ప్రకంపనలతో మరోసారి దద్దరిల్లాయి. కేంద్ర భూభాగమైన అండమాన్, నికోబార్ దీవుల నుంచి క్యాంబ్ బెలే బే వరకు బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలోజీ(నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ).. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, ఈ సంఘటన వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు.
భూకంపం భూమి నుంచి 40 కిలోమీటర్ల లోతులో వచ్చినట్టుగా సమాచారం. కొద్ది రోజుల ఈ నెల 11న అండమాన్, నికోబార్ దీవులలో ఉదయం 8.50 గంటలకు భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైంది. భూకంప కేంద్రం అండమాన్, నికోబార్ దీవులలోని దిగ్లీపూర్‌కు ఉత్తరాన 137 కిలోమీటర్లలో దూరంలో సంభవించింది.
ఇక అదే సమయంలో ఆగస్ట్ 31న పోర్ట్ బ్లెయిర్‌లోనూ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైందని.. నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ తెలిపింది. పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 116 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. అండమాన్, నికోబార్ దీవులలో ఆగస్ట్ 20న మరోసారి భూకంపం వచ్చింది. ఈ దీవులలో అనేకసార్లు భూకంప ప్రకంపనలు సంభవించగా, ఒక నెలలో దాదాపు 3 , 4 సార్లు భూకంపాలు సంభవించిన ఘటనలు ఉన్నాయి.
Source: Tv9





