News

చైనా ఔషధ ముడిసరుకుపై కేంద్రానికి అరబిందో ఫిర్యాదు

417views

న్యూఢిల్లీ: ఔషధ పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐల కోసం చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని, ఈ విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఫార్మా పరిశ్రమతో కలిసి బల్క్‌ ఔషధాల పార్కులు ఏర్పాటు చేయడం, వివిధ పథకాల కింద రాయితీలు, సత్వర అనుమతులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతోంది.

కానీ, చైనా మాత్రం ముడి రసాయనాలను మనదేశంలోకి అతి తక్కువ ధరలకు కుమ్మరించడం (డంపింగ్‌) ద్వారా దేశీయ పరిశ్రమను ఎదగనీయకూడదనే ప్రయత్నాలు చేపట్టింది. ఈ వ్యవహారాన్ని అరబిందో ఫార్మా కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. దీన్ని సమగ్రంగా పరిశీలించి యాంటీ-డంపింగ్‌ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌’ను కోరింది.