
లక్నో: అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనాల ప్రదర్శనను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కీర్తిశేషులు కళ్యాణ్ సింగ్‌ని స్మరించుకొన్నారు.
రక్షణ రంగంలో అలీగఢ్ ఎదుగుదలను, అలాగే అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి స్థాపనను చూస్తే కళ్యాణ్ సింగ్ చాలా సంతోషించే వారు అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమం కోసం వారి దగ్గర ఉన్నదంతా అర్పించివేశారు అనే వాస్తవాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
అయితే, స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశం చేసుకొన్న దురదృష్టం ఏమిటి అంటే అది ఆ కోవకు చెందిన జాతీయ కథానాయకుల, జాతీయ కథానాయికల త్యాగాలను గురించి దేశంలో తదుపరి తరాల వారికి తెలియజెప్పకపోవడమే అని ప్రధాన మంత్రి అన్నారు. వారి గాథలను తెలుసుకొనే భాగ్యానికి దేశంలోని అనేక తరాల వారు నోచుకోలేకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ రోజు న 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం 20వ శతాబ్దంలో జరిగిన ఈ పొరపాటులను సరిదిద్దుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.
Source: Pib





