News

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ఆంధ్రా కూలీలు దుర్మరణం!

506views
  • కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో దుర్ఘటన

చిక్‌బల్లాపూర్‌: కర్నాటక రాష్ట్రం, చిక్‌బల్లాపూర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. కూలీలతో వెళ్తున్న జీపు ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ కూలీలంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.

Source: Andharaprabha

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి