News

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా!

511views

న్యూఢిల్లీ: చైనాలో క‌రోనా మ‌ళ్ళీ విజృంభిస్తోంది. దక్షిణ చైనా.. ఫుజియాన్​ రాష్ట్రంలోని పుతియాన్​ నగరంలో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేగింది. 24గంటల్లో అక్కడ కొత్తగా 190 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడానికి అధికారులు కఠిన చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో పుతియాన్​లో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నిపుణులను పంపినట్టు చైనా ఎన్​హెచ్​సీ తెలిపింది.

నగరంలోని ప్రజలు .. నగరం దాటి వెళ్లవద్దంటూ ఆంక్షలు పెట్టారు. అంతేకాదు పుతియాన్ లోని బస్సు, రైలు సేవలను నిలిపివేశారు. అయితే, అత్యవసరంగా నగరం దాటి వెళ్లేవారు.. తప్పనిసరిగా 48 గంటల ముందు కొవిడ్​ నెగెటివ్​గా సర్టిఫికెట్ చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు నగరంలోని సినిమా హాళ్లు, పేకాట స్థలాలు, జిమ్​లు, పర్యటక ప్రదేశాలతో పాటు జనం ఎక్కువగా ఉండే అన్ని రకాల ప్రదేశాలను అధికారులు క్లోజ్ చేశారు.

రెస్టారెంట్లు, సూపర్​ మార్కెట్లకు మినహాయింపు ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు ఫుజియాన్ తో పాటు క్వాన్​జోవులో కూడా మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి