News

హిందూ ఆలయాలపై ఆగని దాడులు!

213views
  • గోడలు కూల్చివేత, నగదు, వస్తువుల చోరీ

  • బంగ్లాదేశ్‌లో యథేచ్ఛగా హింస

ఢాకా: పొరుగున గల బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఆగస్టు-సెప్టెంబర్‌లో పలు ఆలయాల్లో దుండగలు చొరబడి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. ఆగస్టు 24 మంగళవారం, బంగ్లాదేశ్‌లోని గైగంధ జిల్లాలోని సుందర్‌గంజ్‌ ఉప జిల్లాలోని ధోపదాంగ యూనియన్‌లో ఉన్న దక్షిణ ధోపదాంగ గ్రామంలోని రెండు హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని రాడికల్‌ సమూహం దాడి చేసింది.

ప్రముఖ పటారి కాళీ దేవాలయంతో సహా రెండు ఆలయాలను ధ్వంసం చేశారు. ఈ దేవాలయాలలోని ఏడు హిందూ దేవతల మూర్తిలను తగలబెట్టారు. విలువైన వస్తువులన్నీ దొంగిలించారు. ఈ విధ్వంసం, దోపిడీ ఆగస్టు ఏడో తేదీన ఖుల్నా జిల్లాలోని రుప్సా ఉప జిల్లాలోని 10 దేవాలయాల దోపిడీతో ప్రారంభమైంది.

పురాతన ఆలయంలో విధ్వంసం

బంగ్లాదేశ్‌లోని హిందూ కార్యకర్తల ఆరోపణల ప్రకారం… మతువా సమాజంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులు శ్రీశ్రీ హరిచద్‌ ఠాకూర్‌, శాంతి మాతా దేవి జంట. నారైల్‌ జిల్లాలోని నారైల్‌ సదర్‌ ఉప జిల్లాలోని షోల్‌పూర్‌లో ఉన్న వీరి మూర్తులను ఆగస్టు 18న తీవ్రవాదులు పడగొట్టారు. అలాగే, 27న శుక్రవారం ఫిరోజ్‌పూర్‌లోని నేసరాబాద్‌ ఉప జిల్లాలోని 200 ఏళ్ళ పురాతన హిందూ దేవాలయంపై గుర్తు తెలియని దుర్మార్గులు దాడి చేసి, విధ్వంసం సృష్టించారు.

ఆ ప్రాంతానికి చెందిన బిజిపోభూషోన్‌ మిస్త్రీ, నేషరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మతపరమైన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశంలో జరిగిన ఘటనకు సంబంధించిన నేరగాళ్ళను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నామని నేసరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌-ఇన్‌-ఛార్జ్‌ అబీర్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ తెలిపారు.

దొరికిన మతోన్మాది!

నోఖాలి మైజ్‌దీ పట్టణంలో ఉన్న శివాలయంలోని మూర్తులను ధ్వంసం చేస్తున్నప్పుడు 18 ఏళ్ల మోస్లేహుద్దీన్‌ అకా షకిల్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ దొంగ ఆగస్టు 16 రాత్రి 11 గంటల తర్వాత హిందూ దేవాలయంలోకి చొరబడ్డాడు. అరాచకం సృష్టించాడని స్థానికులు ప్రత్యక్ష సాక్ష్యమిస్తూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఆలయం గోడ కూల్చివేత

ఈ నెల ఒటోతేదీన బుధవారం రావుజాన్‌ ఉప జిల్లాలోని శ్రీశ్రీ మాగేశ్వరి ఆలయంలోని మతోన్మాదులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఆలయ గోడను దుర్మార్గులు కూల్చివేశారు. దోపిడీదారులు 50,000 బంగ్లాదేశ్‌ టకా మొత్తాన్ని దోచుకున్నారని, దోపిడీ జరిగినప్పటి నుండి దేవాలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా లేవని బంగ్లాదేశీ హిందూ కార్యకర్త ఆరోపించారు.

Source : HinduPost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి