News

పాపం… నెల్లూరు పిల్లలు!

603views

నెల్లూరు: పాపం… ఆ ఇద్దరు నెల్లూరు పిల్లలను చూస్తుంటే జాలేస్తుంది… మరో వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పిస్తుంది… సినిమా హాళ్ళ, బార్లలో ‘చీర్స్‌’లకు, హోటళ్ళకు, ఆ పార్టీ సొంత నాయకుల పండగలు పబ్బాలకు లేని కరోనా… హిందువుల పండగలు వస్తే ఉంటుందా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సంగతిలోకి వెళితే…

ఏపీ సర్కార్‌ కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలకు ని‘బంధన’లు పెట్టిన విషయం విదితమే. హైకోర్టు తీర్పు వచ్చినా భక్తులు నిరసన వ్యక్తం చేసిన సంగతీ తెలిసిందే… ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా, గూడూరులోని నాలజలమ్మ వీధిలో వినాయక చవితి కోసం చిన్నారుల ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల అనుమతులు తప్పనిసరి అని తెలియడంతో ఆ ఇద్దరు చిన్నారులు ఆవేదన చెందారు. అప్పటికే విగ్రహం, పూజాద్రవ్యాలు కొనుగోలు చేసేశారు. దిక్కుతోచని పరిస్థితిలో ఎలాగైనా స్వామి గణేశుడి పండగ ఘనంగా జరుపుకోవాలని, చవితి పూజ చేస్తే బాగా చదువు వస్తుందని గ్రహించి, ఏకంగా గూడూరు పోలీస్‌ స్టేషన్‌కే వెళ్ళిపోయారు.

తాము కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు చేసుకుంటామని అనుమతి ఇవ్వాలని అక్కడి పోలీసులను అభ్యర్థించారు. అయితే, చిన్నారుల విజ్ఞప్తిపై స్పందించిన పోలీసులు ప్రైవేటు స్థలంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల చివరికి చిన్నారులు కూడా భక్తితో పూజలు చేసుకునే పరిస్థితి ఆంధ్రరాష్ట్రంలో లేకుండాపోయిందని పలువురు భక్తులు శాపనార్థాలు పెడుతున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి